ఇంట్రెస్టింగ్..”ప్రాజెక్ట్ కే” గా స్టార్ట్ అయిన ప్రభాస్ బిగ్గెస్ట్ వండర్.!

Published on Jul 24, 2021 2:00 pm IST


పాన్ ఇండియన్ స్టార్ యంగ్ రెబల్ స్టార్ హీరోగా నటిస్తున్న పలు భారీ చిత్రాల్లో ఏకంగా పాన్ వరల్డ్ స్పాన్ తో ఓ చిత్రం కూడా తెరకెక్కుతుంది. యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కించనున్న ఈ భారీ స్కై ఫై చిత్రం ఈరోజే మొదలవ్వనుందని తెలిసిందే.

మరి దానిని ఈరోజు మేకర్స్ షురూ చేసేసారు. అయితే ఈరోజే ఎందుకు స్టార్ట్ చేసారో అన్నది కూడా వినిపిస్తుంది. ఈరోజు గురు పూర్ణిమ కారణంగా అందులోని అందరి గురు అమితాబ్ బచ్చన్ తో సన్నివేశాలనే కావాలని ప్లాన్ చేశారట. అలాగే ఈ ఫస్ట్ క్లాపింగ్ పై “ప్రాజెక్ట్ కే” అనే టైటిల్ ని పొందుపరచడం ఆసక్తిగా మారింది.

మరి ఈ సినిమాకి ‘కే’ అనే లెటర్ తో టైటిల్ ఏమన్నా ఉంటుందేమో అన్నది చూడాలి. అలాగే ఈరోజు మొదలైన షూట్ ఒక వారం రోజులు పాటు కొనసాగనున్నట్టు తెలుస్తుంది. మరి ఇండియన్ సినిమా దగ్గర అత్యంత ఖరీదైన సినిమాగా తెరకెక్కుతున్న ఈ వండర్ ఎలా ఉంటుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :