ఇంటర్వ్యూ : నాగార్జున – “బంగార్రాజు” కి కూడా సీక్వెల్ అలా అయితేనే ఉంటుంది

Published on Jan 14, 2022 12:20 am IST

ఈ సంక్రాంతి కానుకగా రిలీజ్ కి రెడీగా ఉన్న మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో కింగ్ నాగార్జున మరియు తన కొడుకు అక్కినేని నాగ చైతన్య లు హీరోలుగా దర్శకుడు కళ్యాణ్ కృష్ణ తన హిట్ సినిమా “సోగ్గాడే చిన్ని నాయన” కి సీక్వెల్ గా తెరకెక్కించిన చిత్రం “బంగార్రాజు” కూడా ఒకటి. మరి రిలీజ్ కి రెడీగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నాగ్ లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చారు. మరి అందులో తాను ఎలాంటి విషయాలు పంచుకున్నారో చూద్దాం.

 

చెప్పండి అప్పుడు పెద్ద బంగార్రాజు, ఇప్పుడు చిన్న బంగార్రాజు గా అలరించబోతున్నారు ఈసారి ఎలా ఉంటుంది.?

ఈ సినిమాకి ఆ సినిమాకి ఉన్న మార్పే ఇది.. ఈసారి చిన్న బంగార్రాజు ఎంటర్ అయ్యాడు. అప్పుడు సారి యూత్ కి కనెక్ట్ అవ్వడం జరగలేదు కానీ ఈసారి చిన్న బంగార్రాజు తో అది కూడా పూర్తవుతుంది. చైతు మంచి ఎనర్జిటిక్ గా చేసాడు.

 

మరి ఈ సినిమాకి పెంచిన భాధ్యతలు ఏమన్నా ఉన్నాయా?

ఫస్ట్ సినిమా అందరికీ బాగా నచ్చింది సో వాళ్ళు అంతా ఈ సినిమా కూడా చూడాలి అనుకుంటారు. ఖచ్చితంగా భాద్యతలు పెరుగుతాయి, అలాగే ఆడియెన్స్ కి కూడా చెబుతున్నాం పండగ లాంటి సినిమా ఇది ఖచ్చితంగా సంక్రాంతి కి తగ్గట్టుగా ఉంటుంది.

 

మరి ఈ సినిమాలో చైతూ రోల్ ఎలా వస్తుంది కావాలనే పెట్టారా?

లాస్ట్ సినిమాలో అంటే తన కొడుకుని కాపాడుకునే తండ్రిలా కథ కనిపిస్తుంది. అలానే ఇందులో ఎలా ఉంటుంది అంటే అదే తండ్రి కొడుకుల బ్లడ్ లైన్ తో కొనసాగింపుగా ఉంటుంది. ఇంకా లాస్ట్ టైం నేను డ్యూయల్ రోల్ లో చేసినా నాన్న గారితో కలిపి చేసినా మా కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది ఈసారి కూడా అలానే అవుతుంది అనుకుంటున్నాను.

 

ఈ సినిమాలో చైతు పెర్ఫామెన్స్ కోసం చెప్పండి?

ఈ సినిమా స్టార్ట్ అయ్యిన ఫస్ట్ రోజు నుంచి కూడా చై బంగార్రాజు లాంటి బోల్డ్ ఇంట్రెస్టింగ్ రోల్ ని చెయ్యగలడు అనుకోలేదు. కానీ నేను బలవంతం పెట్టి ఈ సినిమాకి సైన్ చేయించాను. కానీ ఈ సినిమాకి మాత్రం చై తనలోని బెస్ట్ ఇచ్చేసాడు. మీరంతా ఖచ్చితంగా తనలోని కొత్త యాంగిల్ ని చూస్తారు.

 

ఈ సినిమాకి మళ్ళీ రమ్య కృష్ణ గారితో చేశారు ఈ సినిమాలో ఎక్స్ పీరియన్స్ కోసం చెప్పండి?

మా ఇద్దరి కాంబో ఎప్పుడు నుంచో ఉన్నదే. మా ఇద్దరికీ తెలుసు ఎవరు ఎవరితో ఏ రోల్ కి ఎలా చెయ్యాలి అనేది. అందుకే మళ్ళీ ఈసారి కూడా మా కాంబో ఖచ్చితంగా మరింత అలరిస్తాం. తను కూడా సెట్స్ లో చాలా సరదాగా కే=జోక్స్ చెబుతూ ఉంటుంది.

 

యంగ్ యాక్ట్రెస్ కృతి శెట్టి కోసం ఏమన్నా చెప్పండి?

ఆమెలో నాకు బాగా ఎక్కువ నచ్చిన విషయం ఏమిటంటే చాలా తక్కువ టైం లోనే తను తెలుగు నేర్చేసుకుంది. నటన పరంగా కూడా చాలా ప్రొఫెషినల్ ఉంటుంది. ఈ సినిమాలో మంచి రోల్ లో ఆ అమ్మాయి కనిపిస్తుంది. ఖచ్చితంగా కెరీర్ లో కృతి మంచి స్టేజ్ కి వెళుతుంది.

 

మరి ఈ “బంగార్రాజు” కి కూడా సీక్వెల్ ఉంటుందా?

మేము ముందు సోగ్గాడే చిన్ని నాయన సినిమాని సోలో గానే ప్లాన్ చేసాం కానీ దానికి సీక్వెల్ తర్వాత వచ్చింది. అలాగే బంగార్రాజు ఆత్మ సినిమాలో ఎప్పుడైనా ఏ టైం లైన్ లో అయినా రాగలడు. ఇపుడు ఈ సినిమా కూడా హిట్ అయితే దీనికి కూడా సీక్వెల్ ఖచ్చితంగా ఉండొచ్చు.

 

ఇక డైరెక్టర్ కళ్యాణ్ తో వర్క్ ఎక్స్ పీరియన్స్ కోసం చెప్పండి.!

ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించి తన దగ్గర ఒక ఐడియా ఉందని కొన్నాళ్ల కితం నాకు చెప్పాడు. అప్పుడు నేను కంప్లీట్ సినిమా కథ రాసుకొని తీసుకురమ్మన్నాను అది కూడా ఒకవేళ నాకు నచ్చితేనే చేస్తానని చెప్పను. ఆ తర్వాత కొంత కాలం కి ఒక మంచి మసాలా సినిమా తీసుకొచ్చాడు. ఈ సినిమాని కూడా మరింత ఎంటర్టైనింగ్ గా తీసాడు.

 

నా సినిమాకి ఈ టికెట్ రేట్లు ఎలాంటి నష్టం కలిగించవని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, దీనిపై ఏం చెప్తారు?

ఆ జీవో ఏప్రిల్ లో వచ్చింది కానీ మా సినిమా ఆగష్టు లో స్టార్ట్ అయ్యింది. అందుకే అలా చెప్పాను. ఆ రేట్స్ కి తగ్గట్టుగానే మా సినిమాని బడ్జెట్ ప్లాన్ చేసి చేసాం. అందుకే ఈ రేట్లు తో మా సినిమాకి ఎలాంటి ఇబ్బంది ల్దాని చెప్పాను. అలాగే మేము కూడా ఈ సినిమాని కంప్లీట్ చేసి చేతిలో పెట్టుకొని ఇంట్లోనే కూర్చోలేం కదా?

సంబంధిత సమాచారం :