ఇంటర్వ్యూ: హన్సిక మోత్వానీ- ఆ వెబ్ సిరీస్ లో నాపాత్ర చాలాఎక్సయిటింగ్ గా ఉంటుంది.

Published on Nov 13, 2019 1:21 pm IST

అల్లు అర్జున్ హీరోగా వచ్చిన దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన హన్సిక మోత్వానీ తెలుగులో ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి స్టార్ హీరోల చిత్రాలలో కూడా నటించింది. తమిళ చిత్రాలలో బిజీ ఐన తరువాత ఈఅమ్మడు తెలుగు చిత్రాలు చేయడం తగ్గించింది. ఐతే తాజాగా ఆమె సందీప్ కిషన్ హీరోగా జి నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ చిత్రంలో హీరోయిన్ గా నటించడం జరిగింది. ఈ మూవీ ఈనెల 15న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హన్సిక మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆ విశేషాలు మీకోసం…

ఈ మూవీ ఒప్పుకోవడానికి గల కారణాలేమిటి?

గతంలో నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో ‘దేనికైనా రెడీ’ చిత్రాన్ని చేయడం జరిగింది. ఆప్పటినుండీ ఆయనతో మంచి పరిచయం ఉంది. ఈ మూవీలో నా పాత్ర గురించి చెప్పినప్పుడు ఎక్సయిటింగ్ గా అనిపించింది. అందుకే వెంటనే ఒప్పుకున్నాను.

 

మీతో పాటు వరలక్ష్మీ మరో కీలక పాత్ర చేస్తున్నారని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు?
వరలక్ష్మీ గారు మంచి నటి, అలాగే ఆమె ఈ మూవీలో ఓ కీలక పాత్ర చేయడం జరిగింది. ఐనప్పటికీ నా పాత్ర ప్రాధాన్యం వేరు. ఆమె సినిమాలో ఉండటం వలన నా పాత్ర డామినేట్ అవుతుందనే భావన నాకు లేదు. ఇప్పటి దర్శకులు అన్ని పాత్రలకు ప్రాముఖ్యం ఉండేలా స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటున్నారు.

 

ఎందుకు తెలుగులో అరుదుగా చిత్రాలు చేస్తున్నారు?

దురదృష్టవశాత్తు ఎందుకో ఒక తెలుగు చిత్రం చేశాక మరొకటి చేయడానికి రెండేళ్ల సమయం పడుతుంది. నేను తమిళ సినిమాలలో బిజీ అవడం వలన కూడా తెలుగులో సినిమాలు చేయలేక పోతున్నాను. కానీ తెలుగులో సినిమా చేసే అవకాశం ఎప్పుడు వచ్చినా తప్పకుండా చేస్తాను. నాకు భాషా భేధాలు ఏమీ లేవు. మంచి చిత్రం అనుకుంటే ఏభాషలోనైనా చేస్తాను.

 

ఇప్పటివరకు నడచిన మీ సినీ కెరీర్ గురించి ఏమంటారు?
ఇప్పటికే పలు భాషలలో 50కి పైగా చిత్రాలు చేశాను. నాకు మంచి పాత్రలు ఇచ్చిన దర్శకులకు, నిర్మాతలకు, నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు. అలాగే నేను చేస్తున్న పాత్రల పట్ల నేను సంతృప్తిగా ఉన్నాను.

 

భవిష్యత్తులో నెగెటివ్ రోల్స్ చేస్తారా?
ఖచ్చితంగా, పూర్తి స్థాయి నెగెటివ్ రోల్ చేయకున్నప్పటికీ కొన్ని చిత్రాలలో ఆల్రెడీ ఆ తరహా పాత్రలను చేయడం జరిగింది. నాకు తెలిసి కామెడీ, విలన్ పాత్రలు చేయడం చాలా కష్టం. అలాంటి పాత్రలు చేసే అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను.

 

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమిటీ?
తమిళంలో నాలుగు చిత్రాల వరకు చేస్తున్నాను. దర్శకుడు అశోక్ తెరకెక్కించనున్న అమెజాన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్నాను. ఆ వెబ్ సిరీస్ లో నాపాత్ర చాలా ఎక్సయిటింగ్ గా ఉంటుంది.

సంబంధిత సమాచారం :