ఇంటర్వ్యూ: విజయ్ దేవరకొండ- ఆ విషయంలో నేను ఇంకా పిల్లాడినే అనుకుంటున్నా.

ఇంటర్వ్యూ: విజయ్ దేవరకొండ- ఆ విషయంలో నేను ఇంకా పిల్లాడినే అనుకుంటున్నా.

Published on Feb 11, 2020 1:37 PM IST

విజయ్ దేవరకొండ హీరోగా దర్శకుడు క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఎమోషన్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ వరల్డ్ ఫేమస్ లవర్. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాశి ఖన్నా, క్యాథరిన్, ఐశ్వర్య రాజేష్, ఇసాబెల్లా హీరోయిన్స్ గా నటించారు. ఈ చిత్రం ఈనెల 14న ప్రేమికుల రోజు కానుకగా విడుదల కానుంది. ఈ సంధర్భంగా హీరో విజయ్ మీడియాతో చిత్ర విశేషాలు పంచుకున్నారు..

 

ఈ చిత్రాన్ని అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ చిత్రాలతో పోల్చుతున్నారు?

అర్జున్ రెడ్డి లాంటి హిట్ మూవీతో పోల్చడం మంచిదే. కానీ అర్జున్ రెడ్డి సినిమాతో ఈ చిత్రానికి పోలికవుండదు. నేను ఇప్పుడు గడ్డంలో యాక్షన్ మూవీ చేసినా, ఫిక్షన్ మూవీ చేసినా అర్జున్ రెడ్డి మూవీతో పోల్చుతారు. ఈ చిత్రంలో మూడు లవ్ స్టోరీస్ ఉంటాయి,వాటిలో ఒక లవ్ ట్రాక్ మాత్రం అర్జున్ రెడ్డి పాత్రను కొంచెం పోలి ఉంటుంది.

 

ప్రేమకథలు చేయని చెప్తున్నారు కారణం?

కొత్తగా అన్ని రకాల కథలు చేయాలి, ఎప్పుడూ ఒకేరకమైన కథలు చేయడం నాకు మంచిది కాదు, ప్రేక్షకులకు కూడా ఇష్టం ఉండదు.

 

ఈ సినిమాలో మూడు ప్రేమ కథలు అంటున్నారు? వాటి మధ్య రిలేషన్ ఉంటుందా?
మూడు కథలకు మధ్య రిలేషన్ ఉంటుంది, ఆ రిలేషన్ ఏమిటనేది మీరు తెరపై చూసి తెలుసుకోవాలి.

 

దర్శకుడు క్రాంతి మాధవ్ గురించి మీ అభిప్రాయం?

ఆయన రైటింగ్ స్కిల్స్ అమోఘం, వరల్డ్ ఫేమస్ లవర్ క్రాంతి గారి బ్రెయిన్ చైల్డ్. ఈ చిత్రం ఇంత బాగా రావడంలో క్రెడిట్ అంతా ఆయనదే. అలాగే కెమెరా మెన్ అండ్ నిర్మాత కే ఎస్ రామారావు గారు చాలా సహకారం అందించారు.

 

ఇంత ఫేమ్ సంపాదించారు ఎలా అనిపిస్తుంది?
అందరూ మన గురించి మాట్లాడటం, అభిమానించడం చూస్తుంటే ఇంకేమి కావాలి అనిపిస్తుంది. ఐతే నాకు ఇండియాని రూల్ చేయాలని ఉంది(నవ్వుతూ)

 

వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రం కోసం బాగా కష్టపడ్డారా?
నా కెరీర్ లో హార్డెస్ట్ మూవీ వరల్డ్ ఫేమస్ లవర్. ఫిజికల్ గా, మెంటల్ గా చాలా ఒత్తిడిగి గురయ్యాను. వివిధ గెటప్స్, పాత్రలలో వేరియేషన్స్ కొరకు చాల కష్టపడాల్సివచ్చింది.

 

ప్రస్తుతం ప్రేమపై మీ అభిప్రాయం?

ఒకప్పుడు ప్రేమ అనేది నాన్ సెన్స్ అనుకున్నా… కానీ ఇప్పుడు ప్రేమపై నాకు నమ్మకం కుదిరింది, లైఫ్ లో ప్రేమ అనేది ఉండాలి.

 

మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు?
పెళ్లి చేసుకుంటా కానీ ఇప్పుడే కాదు, నా ఒపీనియన్ లో నేను ఇంకా పెళ్ళికి సిద్ధం కాలేదు, ఇంకా పిల్లాడినే అనుకుంటున్నా. పెళ్లి అనేది చాలా పెద్ద భాద్యత అందుకే ఇంకొంత సమయం తరువాత ఆలోచిస్తా.

 

వరల్డ్ ఫేమస్ లవర్ కి ఇంకేమైనా టైటిల్స్ అనుకున్నారా?
ప్రియం, ముంబై తీరం అనే టైటిల్స్ కూడా అనుకున్నాం…కానీ అవి కొంచెం పాతకాలపు సినిమా పేర్లలా అనిపించాయి. అందుకే వరల్డ్ ఫేమస్ లవర్ అనే టైటిల్ ఫిక్స్ చేశాం.

 

లవ్ స్టోరీస్ చేయను అంటున్నారు, అంటే కమర్షియల్ సినిమాలు చేస్తారా?

లవ్ స్టోరీస్ చేయనంటే అర్థం, కమర్షియల్ సినిమాలు చేస్తాను అని కాదు..అర్జున్ రెడ్డి, డియర్ కామ్రేడ్ తరహా సినిమాలు చేయను అని అంటున్నాను. ఐతే పూరి సినిమాలో కొంచెం లవ్ కాన్ఫ్లిక్ట్ ఉండే అవకాశం కలదు.

 

డియర్ కామ్రేడ్ ఫలితం పై మీ అభిప్రాయం?
ఆ సినిమాకు రివ్యూస్ ఎలా వచ్చినా నార్త్ ఇండియా, నేపాల్, బంగ్లాదేశ్, పాకిస్థాన్ వంటి దేశాలలో మంచి ఆదరణ దక్కించుకుంది. అలాగే ఫైటర్ షూటింగ్ చేస్తుంటే ముంబైలో అందరూ బాబీ అని పిలుస్తున్నారు. ఆ చిత్ర ఫలితంపై నేను సంతృప్తి కరంగా ఉన్నాను.

 

సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, మీమ్స్ ఎలా తీసుకుంటారు?
బాగా ఇష్టపడతాను, నాపై ఎంత ప్రేమ లేకపోతే, నేను ఎంత గుర్తుకు రాకపోతే గంటల తరబడి కూర్చోని అలాంటి మీమ్స్ తయారు చేస్తారు. కంస్ట్రక్టీవ్ క్రిటిసిజం నేనే ఇష్టపడతాను

 

మీరు ఎలా ఉండడానికి ఇష్టపడతారు?
నేను నాలా ఉండటానికి ఇష్టపడతాను, అది చేయకూడదు, ఇది చేయకూడదు అని జనరేషన్స్ ని మనం ఆపేస్తున్నాం. చేసే పనికి వచ్చే ఫలితం ఏదైనా నేను స్వీకరిస్తాను, ఎందుకంటే అది నేను సొంతగా తీసుకున్న నిర్ణయం కాబట్టి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు