పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘ప్రాజక్ట్ – కె’ రిలీజ్ పై ఇంట్రస్టింగ్ బజ్

Published on Feb 16, 2023 9:00 pm IST


టాలీవుడ్ స్టార్ హీరోల్లో ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఒకింత వేగంగా సినిమాలు ఎంచుకుంటూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే ఆయన నటించిన మైథలాజికల్ మూవీ ఆదిపురుష్ జూన్ లో రిలీజ్ కి రెడీ అవుతుండగా దాని అంతరం ప్రశాంత్ నీల్ తో చేస్తున్న భారీ మాస్ యాక్షన్ మూవీ సలార్ సెప్టెంబర్ చివర్లో ఆడియన్స్ ముందుకి రానుంది. ఇక వీటితో పాటు మారుతీ తో ఒక మూవీ అలానే నాగ అశ్విన్ తో ప్రాజక్ట్ కె సినిమాలు కూడా చేస్తున్నారు ప్రభాస్.

అయితే విషయం ఏమిటంటే, ప్రభాస్ నటిస్తున్న ప్రాజక్ట్ కె మూవీ పై అందరిలో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. భారీ సైన్స్ ఫిక్షన్ జానర్ లో రూపొందుతున్న ఈ మూవీ వైజయంతి మూవీస్ బ్యానర్ పై అత్యంత భారీ వ్యయంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతుండడమే దీనికి కారణం. ఇక ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారం అవుతోంది. అదేమిటంటే, రానున్న శివరాత్రి తరువాత ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ ని యూనిట్ పక్కాగా అనౌన్స్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అలానే ఈ మూవీని రెండు భాగాలుగా తీస్తారా అనే దానిపై కూడా యూనిట్ క్లారిటీ ఇవ్వనుందట. ఇక ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి లేదా సమ్మర్ కు రిలీజ్ అయ్యే అవకాశం ఉందట. మొత్తంగా ప్రాజక్ట్ కె మూవీ రిలీజ్ కి సంబంధించి పక్కాగా క్లారిటీ రావాలి అంటే మరికొద్దిరోజుల వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :