హిందీ లో “దేవర” ఓపెనింగ్స్ పై నెలకొన్న ఆసక్తి!

హిందీ లో “దేవర” ఓపెనింగ్స్ పై నెలకొన్న ఆసక్తి!

Published on Apr 10, 2024 10:00 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) ప్రధాన పాత్రలో, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ దేవర (Devara). బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ (janhvi Kapoor) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో, బాలీవుడ్ స్టార్ యాక్టర్ సైఫ్ అలీఖాన్ (saif ali khan)విలన్ పాత్రను పోషిస్తున్నారు. ఈ చిత్రం ను ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 10, 2024 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రం యొక్క హిందీ థియేట్రికల్ రైట్స్ ను ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఏఏ ఫిలిమ్స్ ఇండియా వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ మూవీ తో విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. దేవర కి ఇది ప్లస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాక హిందీ లో ప్రముఖ నిర్మాణ సంస్థలు హిందీ రైట్స్ కొనుగోలు చేయడం తో దేవర హిందీ వసూళ్ల పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాక హిందీ లో ఇంక ఎలాంటి ఓపెనింగ్స్ రాబడుతుందో అని అందరిలో క్యూరియాసిటి ఉంది.

NTR ఆర్ట్స్ మరియు యువసుధ ఆర్ట్స్ బ్యానర్ లపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ అనిరుద్ రవి చందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం ఆడియెన్స్, ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు