ధరమ్ తేజ్ ఈసారి ఎవర్ని ఆహ్వానిస్తారో చూడాలి !

31st, January 2018 - 11:16:31 AM

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తాజా చిత్రం ‘ఇంటిలిజెంట్’ ఫిబ్రవరి 9న రిలీజ్ కానుంది. దీంతో చిత్ర టీమ్ ప్రమోషన్లలో భాగంగా ఫిబ్రవరి 4వ తేదీన రాజమండ్రిలో భారీ ఎత్తున ప్రీ రిలీజ్ వేడుకను ప్లాన్ చేశారు చిత్ర నిర్మాత సి.కళ్యాణ్. అయితే టీజర్ ను నందమూరి బాలక్రిష్ణతో, మొదటి పాటను రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా లాంచ్ చేయించిన చిత్ర టీమ్ ఈసారి ప్రీ రిలీజ్ వేడుకకు ఎవర్ని ఆహ్వానిస్తారో చూడాలి.

మరోవైపు ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరవుతారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మరి నిజంగా మెగాస్టార్ ఈ కార్యక్రమానికి వస్తారో లేదో ఖచ్చితంగా తెలియాలంటే ఇంకొంత సమయం వేచి చూడాల్సిందే. స్టార్ డైరెక్టర్ వివి.వినాయక్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో తేజ్ కు జోడిగా లావణ్య త్రిపాఠి నటించగా థమన్ సంగీతాన్ని అందించారు.