“అఖండ” ఫస్ట్ సింగిల్ రాబోతోందా.?

Published on May 4, 2021 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “అఖండ”. బాలయ్య మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ఈ హ్యాట్రిక్ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మరి లేటెస్ట్ గా వచ్చిన టీజర్ తో అంచనాలు మరో స్థాయిలో సెట్ చేసుకున్న ఈ చిత్రం ఆడియో హక్కులు కూడా ఈ మధ్యనే లహరి మ్యూజిక్ వారు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మరి ఇదే క్రమంలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ కు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా దాన్ని విడుదల చెయ్యడానికి సరైన సమయం కోసం చూస్తున్నారట. ఇప్పటికే థమన్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి ద్వారకా క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ పెడుతున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :