హాట్ బజ్..’భీమ్లా’ వెనకడుగు వేయనున్నాడా.?

Published on Aug 19, 2021 9:00 am IST


ప్రస్తుతం టాలీవుడ్ లో రానున్న క్రేజీ మల్టీ స్టారర్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిల కాంబోలో వస్తున్న “భీమ్లా నాయక్” కూడా ఒకటి. దర్శకుడు సాగర్ చంద్ర తెరకెక్కిస్తున్న ఈ అల్టీమేట్ మాస్ ఎంటర్టైనర్ పై ఇప్పుడు అంచనాలు మరో లెవెల్లో ఉన్నాయి. మొన్న వచ్చిన గ్లింప్స్ తో అయితే ఈ సినిమా మాస్ లో ఇంకో లెవెల్ స్టాండర్డ్స్ ని సెట్ చేసింది. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రాన్ని మేకర్స్ వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నారని తెలిసిందే..

జనవరి 12 డేట్ ని కూడా ఆల్రెడీ లాక్ చేసేసారు. అయితే ఈ చిత్రం ఇప్పుడు ఆ డేట్ కి రిలీజ్ కావడం లేదు అంటూ హాట్ బజ్ సినీ వర్గాల్లో ఒక లెక్కలో వైరల్ అవుతుంది. అప్పుడుకి పోటీ మరింత రసవత్తరం కానుండడంతో భీమ్లా వెనకడుగు వేయనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో రచ్చ స్టార్ట్ అయ్యింది. అయితే ఇంకా దీనిపై ఎలాంటి అధికారిక క్లారిటీ లేదు కానీ అది వచ్చే సెప్టెంబర్ 2న ఏమన్నా తెలుస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :