సెంటిమెంట్ రిపీట్ ఐతే ఆ దర్శకుడుకి బ్లాక్ బస్టరే

Published on Jul 24, 2019 7:24 am IST

దర్శకుడు హరీష్ శంకర్ సినీ పరిశ్రమ కు వచ్చి చాలా ఏళ్ళవుతుంది. రామ్ గోపాల్ వర్మ నిర్మించిన “షాక్” సినిమాతో దర్శకుడుగా పరిచయమైన హరీష్ అంతకు ముందు కొన్ని సినిమాలకు స్క్రీన్ రైటర్ గా పని చేశారు. హిందీ చిత్రం “దబాంగ్” రీమేక్ గా వచ్చిన “గబ్బర్ సింగ్” సినిమాతో ఆయన బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు.

మళ్ళీ “వాల్మీకి” సినిమా తో ఆ రీమేక్ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలనీ చూస్తున్నారు. వరుణ్ తేజ్ హీరో గా తెరకెక్కుతున్న “వాల్మీకి” తమిళ చిత్రం “జిగర్ తాండ” కి రీమేక్. “గబ్బర్ సింగ్” తరువాత ఆయన ఆ స్థాయి హిట్ అందుకోలేదు. మరి ఈ రీమేక్ సెంటిమెంట్ తోనైనా బ్లాక్ బస్టర్ కొడతాడేమో చూడాలి మరి. 14రీల్స్ బ్యానర్ పై రామ్ ఆచంట నిర్మిస్తుండగా, అధర్వ, పూజా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :