మహేష్ మూవీలో ఫ్యాక్షనిజం…?

Published on Aug 26, 2019 4:18 pm IST

మహేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న “సరిలేరూ నీకెవ్వరూ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రంలో మహేష్ సరసన రష్మికా మందాన నటిస్తుండగా, సీనియర్ హీరోయిన్ విజయశాంతి కీలకపాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుపుకుంటుంది.

కాగా ఓ సన్నివేశం కోసం కర్నూల్ కొండారెడ్డి బురుజు సెట్ వేయడం జరిగింది. దీనితో మహేష్ సరిలేరు నీకెవ్వరూ చిత్రంలో ఫ్యాక్షన్ ఛాయలు ఉంటాయా అనే అనుమానం తలెత్తుతుంది. గతంలోనే ఈచిత్రం ఫ్యాక్షన్ నేపథ్యంలో నడుస్తుందనే వార్తలు రావడం జరిగింది. అలాగే రెడ్డి గారి అబ్బాయి అనే టైటిల్ కూడా పెట్టనున్నారంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు రాయలసీమలో ఫ్యాక్షన్ కి గుర్తుగా చెప్పుకొనే కొండారెడ్డి బురుజు సెట్ లో షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలో గతంలో వచ్చిన వార్తలకు బలం చేకూరుతోంది. ఇదే కనుక నిజమైతే మహేష్ ని మొదటిసారి చేతిలో వేటకొడవలి, మెలితిప్పిన మీసంలో చూస్తామేమో అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :