మరోసారి విజయ్ వర్సెస్ ఎస్ జె సూర్య.?

Published on May 23, 2023 3:10 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు అట్లీ తో చేరిన చిత్రాలు మంచి హిట్స్ కాగా ఈ చిత్రాల్లో సెన్సేషనల్ హిట్ చిత్రం “మెర్సల్” కూడా ఒకటి. మరి ఈ చిత్రంలో వెర్సటైల్ నటుడు ఎస్ జె సూర్య ని ఓ క్రేజీ విలన్ గా అయితే అట్లీ చూపించాడు. అంతే కాకుండా విజయ్ మరియు ఎస్ జె సూర్య మధ్య ఎలాంటి సీన్స్ కూడా ఉన్నాయో తెలిసిందే.

ఇక ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈసారి దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రంలో మరోసారి విజయ్ వర్సెస్ సూర్య కాంబో ని చూడబోతున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఈ కాంబినేషన్ పై చర్చలు నడుస్తుండగా ఎస్ జె సూర్య ఇంకా ఫైనల్ కావాల్సి ఉంది. ఇక దీనికి ముందే ఎస్ జె సూర్య అయితే విజయ్ “వారిసు” లో కూడా ఓ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :