రాజమౌళి ఈ విషయం లో బిజీగా ఉన్నారా?

Published on Jan 21, 2022 3:02 am IST

అందరూ ఎదురుచూస్తున్న మల్టీ స్టారర్ సినిమా RRR. జనవరి మొదటి వారం చివరి నిమిషంలో చాలా మందిని నిరాశ పరుస్తూ సినిమా వాయిదా పడింది. RRR తర్వాత చాలా సినిమాలు కూడా వాయిదా పడ్డాయి. ఈ సినిమా మళ్ళీ ఎప్పుడు విడుదల అవుతుంది, కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.

అయితే ఇప్పటికిప్పుడు రిలీజ్ డేట్ ఫిక్స్ చేసే విషయంలో రాజమౌళి తొందరపడటం లేదనేది ఇన్ సైడ్ సమాచారం. వైరస్ తీవ్రత పెరిగిపోతుండడంతో ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. కాబట్టి, అతను ప్రస్తుతానికి విషయాలను పక్కన పెట్టాడు. తాజా సమాచారం మేరకు సూపర్ స్టార్ మహేష్‌తో తన కొత్త సినిమా స్క్రిప్ట్‌పై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :