ప్రస్తుతం భారతీయ సినిమా దగ్గర ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పలు సినిమాల్లో బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మాసివ్ ప్రాజెక్ట్ రామాయణ కూడా ఒకటి. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమాలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యష్ వంటి బిగ్ స్టార్స్ నటిస్తున్నారు. అయితే పార్ట్ 1 ని మేకర్స్ ఈ దీపావళి కానుకగా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇక దీనికి ముందే చాలా గ్యాప్ లోనే ట్రైలర్ కూడా వదిలారు. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా ఈ ఎపిక్ నుంచి రెండో ట్రైలర్ కూడా రాబోతున్నట్టుగా బజ్ వినిపిస్తోంది. అయితే ఈ రానున్న కొన్ని రోజుల్లో రామాయణ ట్రైలర్ 2 వస్తుందట. సో దీనిపై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఈ సినిమాకి హన్స్ జిమ్మర్, ఏ ఆర్ రెహమాన్ లు సంగీతం అందిస్తున్నారు. అలాగే నమిత్ మల్హోత్రా, యష్ లు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.


