బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్ పై కొత్త రూమర్స్.. కానీ!

బన్నీ, లోకేష్ ప్రాజెక్ట్ పై కొత్త రూమర్స్.. కానీ!

Published on Oct 6, 2026 9:04 AM IST

AA23

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ లెవెల్ లైనప్ ని సెట్ చేసుకొని తన మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో ఉన్న ఈ సినిమాల్లో దర్శకుడు లోకేష్ కనగరాజ్ తో చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. అల్లు అర్జున్ కెరీర్ 23వ సినిమాగా అనౌన్స్ చేసిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు.

కానీ లేటెస్ట్ గా ఈ సినిమా నిలిచిపోయింది అంటూ పలు రూమర్స్ మొదలయ్యాయి. అయితే ఇందులో ప్రస్తుతానికి ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది. కానీ.. ఇక్కడ చిన్న మెలిక ఉందని టాక్. లోకేష్ కనగరాజ్ అల్లు అర్జున్ కి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ నరేషన్ ఇవ్వాల్సి ఉందని టాక్. సో దానిబట్టే సినిమా ముందుకు వెళ్లాలా లేదా అనేది డిసైడ్ అయ్యి ఉందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ అక్కడ ఉన్నది ఏ దర్శకుడు అయినా సరే తన సినిమా కంటెంట్ విషయంలో ఎంత పక్కాగా ఉంటాడో అనేది అందరికీ ఓ క్లారిటీ ఉంది. సో ఈ క్రేజీ ప్రాజెక్ట్ విషయంలో కూడా బన్నీ ఎలాంటి రిస్క్ తీసుకోదల్చుకోలేదట. సో ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

తాజా వార్తలు