యూఎస్ లో ‘జైలర్ 2’ ర్యాంపేజ్.. హాఫ్ మిలియన్ కి చేరువలో!

యూఎస్ లో ‘జైలర్ 2’ ర్యాంపేజ్.. హాఫ్ మిలియన్ కి చేరువలో!

Published on Oct 6, 2026 11:05 AM IST

Jailer 2

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో చేసిన అవైటెడ్ సినిమానే జైలర్ 2. దీనికి ముందు వచ్చిన పార్ట్ వన్ వరల్డ్ వైడ్ గా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. సినిమాలో అతిథి పాత్రలు అనిరుద్ సంగీతం వంటివి ఎంతో ప్లస్ కావడంతో పార్ట్ వన్ పెద్ద హిట్ అయింది. ఇక దీనికి కొనసాగింపుగా వస్తున్న పార్ట్ 2 పై కూడా అదే రీతి అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా దగ్గరకు వస్తున్న సమయంలో యూఎస్ మార్కెట్ లో బుకింగ్స్ కూడా మొదలు కాగా సినిమా అక్కడ సాలిడ్ బుకింగ్స్ తో దూసుకెళ్తుంది. కేవలం ప్రీమియర్స్ తోనే సినిమా అక్కడ ఏకంగా 4 లక్షల డాలర్లు గ్రాస్ రాబట్టేసింది. నెక్స్ట్ ఈజీగా హాఫ్ మిలియన్ డాలర్లు మార్క్ ఈ సినిమా అందుకుంటుంది అని చెప్పొచ్చు. గత సినిమా కూడా యూఎస్ మార్కెట్ లో మంచి వసూళ్ళు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ ఏ రేంజ్ లో పెర్ఫామ్ చేస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు