RC 17: జానర్ పై క్రేజీ రూమర్స్.. నిజం అయితే మాత్రం!

RC 17: జానర్ పై క్రేజీ రూమర్స్.. నిజం అయితే మాత్రం!

Published on Oct 6, 2026 12:58 PM IST

rc17

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు తన ఇండస్ట్రీ హిట్ దర్శకుడు సుకుమార్ తో తన కెరీర్ 17వ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఎనలేని అంచనాలు ఉన్న ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా జానర్ పై మాత్రం క్రేజీ రూమర్స్ మొదలయ్యాయి.

ఇది వరకే సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం చాలా వెర్షన్ లపై పని చేస్తున్నట్టు టాక్ వినిపించింది. అలానే గతంలో ఇదొక ఇంటెన్స్ యాక్షన్ తో కూడిన గ్యాంగ్ స్టర్ డ్రామా అంటూ పలు రూమర్స్ వచ్చాయి. కానీ తాజాగా సినిమా మైథాలజీ బ్యాక్ డ్రాప్ అంటూ కొత్త రూమర్స్ మొదలయ్యాయి. నిజానికి ఈ బ్యాక్ డ్రాప్ లో రామ్ చరణ్ ని చూడాలని ఎప్పుడు నుంచో ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

తన ఆరాకి తగ్గ సాలిడ్ కాన్సెప్ట్ పడితే అది బాగా వర్కవుట్ అవుతుంది అని అభిమానుల నమ్మకం. సో ఇది నిజం అయితే మాత్రం ర్యాంపేజ్ మరో లెవెల్లో ఉండొచ్చు. మరి సుకుమార్ ఏం ప్లాన్ చేస్తున్నారు అనేది మాత్రం అధికారిక క్లారిటీ తోనే బయటకు వస్తుంది. సో అప్పుడు వరకు ఆగి చూడాల్సిందే. ఇక ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తుండగా ఈ దసరా కనుకగా ముహూర్త కార్యక్రమాలతో ఆరంభం కానున్నట్లు టాక్.

తాజా వార్తలు