“పుష్ప 2” లో ఈ లైన్ ఉండదా?

“పుష్ప 2” లో ఈ లైన్ ఉండదా?

Published on Apr 15, 2024 12:00 AM IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర మంచి డిమాండ్ ఉన్న మరో అవైటెడ్ సీక్వెల్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ చిత్రం “పుష్ప 2 ది రూల్” అనే చెప్పాలి. మరి ఈ సినిమా రీసెంట్ టీజర్ తో మరింత హైప్ ని అందుకుంది.

ఇక పుష్ప 1 కి పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఆదరణ అంతా ఇంతా కాదు మెయిన్ గా సాంగ్స్ కి అల్లు అర్జున్ తగ్గేదేలే మ్యానరిజం ఓ రేంజ్ లో హిట్ అయ్యాయి. అయితే ఇప్పుడు ఇదే తగ్గేదేలే డైలాగ్ పుష్ప 2 లో ఉండకపోవచ్చు అనే వినిపిస్తోంది. దీనినే పుష్ప 2 టీజర్ లో వినిపించిన హుప్.. డైలాగ్ తో రీప్లేస్ చేశారు అని టాక్.

మరి ‘తగ్గేదెలే’ అనే లైన్ కి సాలిడ్ రీచ్ వచ్చింది. అలాంటి దాన్ని పార్ట్ 2 లో తీసేయడం అనేది జరగకపోవచ్చు ఒకవేళ అప్డేట్ లా వేరే డైలాగ్ పెట్టినా అది రీచ్ అవుతుందో లేదో చెప్పలేం.. మరి చూడాలి సెన్సేషన్ ని క్రియేట్ చేసిన ఆ డైలాగ్ ఉంటుందో లేదో అనేది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు