ఈ విషయంలో “సాహో”కి “బాహుబలి 2″కి పోలిక ఉందా?

Published on Aug 25, 2019 1:07 am IST

“బాహుబలి” మరియు “సాహో” ఒకటి చరిత్ర సృష్టించి తనకంటూ ఒక చరిత్రను ఏర్పాటు చేసుకున్న సినిమా అయితే మరొకటి చరిత్ర సృష్టించేందుకు సిద్ధంగా ఉంది.ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలలో కామన్ పాయింట్ గా ఉన్నది మాత్రం ప్రభాస్ ఒక్కడే.బాహుబలి దెబ్బతో ఓవరాల్ ఇండియా స్టార్ గా ప్రభాస్ మారిపోయారు.అయితే ఈ రెండు చిత్రాలు కూడా భారీ బడ్జెట్ తో నిర్మితం అయ్యినవే అలాగే అద్భుతమైన విజువల్స్ ఉన్న చిత్రాలే అయితే సాహోలో ఒక ఒక పాటకు ప్రేరణ మాత్రం బాహుబలి 2 సినిమా అని అంతా అంటున్నారు.సాహో ట్రైలర్ ను గమనించినట్లయితే అందులో ఒక సాంగ్ విజువల్స్ కనిపిస్తాయి.

ఒక పడవలోని ప్రభాస్ మరియు శ్రద్దా ఒక గులాబీ వర్ణపు సరస్సు ఉంటుంది.అయితే అచ్చు ఇలాగే కాకపోయినా బాహుబలి 2 లోని “హంసనావ” సాంగ్ లో కూడా విజువల్స్ అద్భుతంగా ఉంటాయి.ఇలా ఈ పాట కూడా ఊహాజనితంగా అంతే గ్రాండ్ గా ఉండబోతుందని ఈ చిన్న క్లిప్ ను చూస్తేనే అర్ధమవుతుంది.దీనితో ఈ పాటకు బాహుబలిలోని పాటే ప్రేరణ కాకపోయినా హీరోహీరోయిన్ల మధ్య ఉన్న లవ్ ట్రాక్ ను చూపించడంలో మాత్రం దగ్గరదగ్గర పోలికలు ఉన్నాయని సోషల్ మీడియా ప్రజానీకం అనుకుంటున్నారు.యూవీ క్రియేషన్స్ నిర్మాణ సారధ్యంలో సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఆగష్టు 30న బాక్సాఫీస్ పై దాడి చెయ్యడానికి సిద్ధంగా ఉంది.

సంబంధిత సమాచారం :