డిస్కో రాజా కోసం లెజెండ్ బాలు దిగడానికి కారణం అదేనా…?

డిస్కో రాజా కోసం లెజెండ్ బాలు దిగడానికి కారణం అదేనా…?

Published on Oct 21, 2019 10:14 PM IST

మాస్ రాజా రవితేజా ఈ సారి ఓ భిన్నమైన సినిమాతో అభిమానులను పలకరించనున్నారు. డిస్కో రాజా పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దర్శకుడు వి ఐ ఆనంద్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిస్తున్నాడని సమాచారం. కాగా ఈ మూవీ నుండి ఓ లిరికల్ సాంగ్ ని రెండు రోజుల క్రితం విడుదల చేయడం జరిగింది. సిరివెన్నెల సాహిత్యంలో థమన్ స్వరపరిచిన ఈ సాంగ్ లెజెండరీ సింగర్ బాల సుబ్రమణ్యం పాడటం విశేషం. ఐతే ఈ పాట బాలు చేత పాడించడం వెనుక ప్రత్యేక మైన కారణం ఉందనిపిస్తుంది.

పాటను మనం గమనించినట్లేతే సాహిత్యం నుండి సంగీతం వరకు 90ల కాలపు నాటి పాటలను పోలి ఉంది. అప్పటి ఫీల్ రావడానికి ఎలెక్ట్రికల్ వైలిన్ ప్రధానంగా చెన్నైలోని ఏ ఎమ్ థియేటర్లో రికార్డు చేయడం జరిగింది. ఆ లిరికల్ వీడియో కూడా టీవీ, క్యాసెట్స్ మరియు అలనాటి వెండి తెరను పోలిన విజువల్స్ కలిగి వుంది. ఇదంతా చూస్తుంటే డిస్కోరాజా చిత్రంలో 90ల కాలం నాటి నేపథ్యంలో కొన్ని ఎపిసోడ్స్ నడుస్తాయని అనిపిస్తుంది. పాయల్ రాజ్ పుత్ రవి తేజా ల మధ్య నడిచే రొమాంటిక్ లవ్ సన్నివేశాలు ఒక ముప్పై ఏళ్ల క్రితం జరిగేవిగా చుపిస్తారేమో. అందుకే ఆ పాటను ప్రత్యేకంగా బాలు గారి చేత పాడించారని అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు