త్రివిక్రమ్ మరో సినిమా కూడా ఫిక్స్ అయ్యిపోయిందా.?

Published on May 2, 2021 4:08 pm IST

తన లాస్ట్ చిత్రం “అల వైకుంఠపురములో”తో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు. ఇక దీని తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో ఓ సినిమా ప్లాన్ చేసినా అది కాస్తా పరిస్థితులు మారి మోస్ట్ అవైటెడ్ కాంబో మహేష్ మరియు త్రివిక్రమ్ గా మారింది. ఇక దీనితో ఈ హ్యాట్రిక్ కాంబోపై మరిన్ని అంచనాలు ఏర్పడ్డాయి.

అయితే ఈ భారీ చిత్రం అనంతరం కూడా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యినట్టు తెలుస్తుంది. అది కూడా మరెవరితోనో కాదు ఆల్రెడీ హ్యాట్రిక్ సినిమాలు చేసేసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తోనే అట. ప్రస్తుతం అయితే పవన్ చేస్తున్న అయ్యప్పణం కోషియం రీమేక్ కు మాటలు అందిస్తున్నారు. మరి నిజంగానే ఈ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందో లేదో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :