వెంకీ మరో మారు పోలీస్ అవతారంలో…?

Published on Aug 31, 2019 2:00 am IST

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నాగ చైతన్య తో కలిసి వెంకీ మామ అనే ముల్టీస్టారర్ చేస్తున్నారు. ఈ మూవీ దసరా కానుకగా విడుదలయ్యే ఆకాశం కలదు. దర్శకుడు బాబీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా వెంకీ మరో కొత్త చిత్రం ఒకే చేశారని తెలుస్తుంది.

నేను లోకల్, సినిమా చూపిస్త మామ, హలో గురు ప్రేమకోసమే వంటి చిత్రాలు తెరకెక్కించిన త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో ఆయన నటించనున్నారని సమాచారం. ఈ చిత్రంలో వెంకటేష్ మరలా పోలీస్ గా కనిపిస్తారట. ఇటీవల బాబు బంగారం చిత్రంలో వెంకటేష్ పోలీస్ గా కనిపించారు. ఈ కొత్త చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించనున్నారు. నవంబర్ నుండి ఈ చిత్రం సెట్స్ పైకెళ్లే అవకాశం కలదు.

సంబంధిత సమాచారం :