“ఇస్మార్ట్ శంకర్” హిట్ కావాలని ఓ అభిమాని సాహసం..!

“ఇస్మార్ట్ శంకర్” హిట్ కావాలని ఓ అభిమాని సాహసం..!

Published on Jul 9, 2019 3:11 PM IST

మనదేశంలో సినీమా హీరోలపై వారి సినిమాలపై అభిమానులు విపరీతమైన ప్రేమకనబరుస్తూ ఉంటారు. అభిమాన హీరో మూవీ హిట్ అవ్వాలని పూజలు, హోమాలు చేయడం, రికార్డు తిరగరాయాలని దేవుళ్ళకు మొక్కుకోవడం సాధారణంగా చూస్తూనే ఉంటాం. ఐతే వాటన్నికిటి భిన్నంగా ఒక మూవీ హిట్ కావాలని ఓ అభిమాని చేసిన సాహసం చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే.

అసలు విషయంలోకెళితే రామ్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” మూవీ ఈ నెల 18న విడుదల కానుంది. ఈ మూవీ ఘనవిజయం సాధించాలని ఓ అభిమాని ఏకంగా తిరుపతి కొండను మోకాళ్లపై ఎక్కి మొక్కుతీర్చుకున్నాడు. సదరు వీడియోని ఇస్మార్ట్ శంకర్ మూవీ నిర్మాతైన ఛార్మి స్వయంగా తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి తనకు కృతజ్ఞలు తెలిపింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు