ప్రభాస్ “ది రాజా సాబ్” షూటింగ్‌లో జాయిన్ అయిన “ఇస్మార్ట్ శంకర్” బ్యూటీ!

ప్రభాస్ “ది రాజా సాబ్” షూటింగ్‌లో జాయిన్ అయిన “ఇస్మార్ట్ శంకర్” బ్యూటీ!

Published on Apr 16, 2024 2:48 PM IST


రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ కెరీర్ లో దూసుకు పోతున్నారు. గతేడాది సలార్ (Salaar) చిత్రం తో ఆడియెన్స్ ను, ఫ్యాన్స్ ను ఆకట్టుకున్న ఈ హీరో, తదుపరి కల్కి 2898AD (Kalki 2898AD) చిత్రం లో కనిపించనున్నారు. అయితే ప్రస్తుతం ది రాజా సాబ్ (The Raja Saab) షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ చిత్రం షూటింగ్ లో ఇస్మార్ట్ శంకర్ బ్యూటీ నిధి అగర్వాల్ (Nidhi Agarwal) జాయిన్ అయినట్లు తెలుస్తోంది.

కొద్దిరోజుల పాటు జరగనున్న ఈ షెడ్యూల్‌లో ప్రభాస్‌తో ఆమె పాల్గొనే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ షెడ్యూల్ గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. హార్రర్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ (Sanjay dutt) కీలక పాత్రలో నటిస్తుండగా, మాళవిక మోహనన్ (Malavika Mohanan) మరొక ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు