తొలిచూపులోనే ప్రేమలో పడ్డ క్షణం గురించి చెప్పిన సమంత..!


సమంత – నాగచైతన్య ల ప్రేమ గురించి తెలియగానే ఈ విషయం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే నిశ్చితార్థం పూర్తి చేసుకున్న ఈ ప్రేమ పక్షులు అక్టోబర్ లో వివాహ బంధం ద్వారా ఒక్కటి కాబోతున్నారు. సాధారణంగా సెలెబ్రిటీ ప్రేమికులు మీడియాకు దూరంగా ఉంటారు. కానీ చైతు, సమంత లు మాత్రం ఆ విషయంలో ఎప్పుడూ భయపడలేదు.

ఓ ఇంగ్లీష్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత..చైతుపై గల ప్రేమని వివరించింది. నాగచైతన్య చూసిన క్షణమే ప్రేమలో పడ్డట్లు సమంత తెలిపింది. సమంత ‘ఏం మాయ చేశావే’ చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయం అయింది. నాగచైతన్య హీరోగా తొలివిజయాన్ని అందుకున్న చిత్రం కూడా అదే. ఆ చిత్రం నుంచే తమ ప్రయాణం మొదలైనట్లు సమంత తెలిపింది. తన మనసులో ఎప్పుడో నాగచైతన్యతో వివాహం జరిగిపోయిందని తెలిపింది. అక్టోబర్ లో జరగబోయే వీరివివాహానికి ప్రత్యేకమైన ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం.