మెగా అభిమానుల పండగ సంబరం మొదలైంది..!
Published on Dec 5, 2016 11:34 am IST

dhruva
మెగా ఫ్యామిలీలో ఉన్నంతమంది హీరోలు తెలుగు సినీ పరిశ్రమలో వేరే ఏ కుటుంబంలోనూ లేరు. వీరికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా మాములుది కాదు. తాజాగా ఈ మెగా అభిమానులందరికీ పండగలా రెండు భారీ బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అందులో మొదటిది మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ‘ధృవ’. ఈవారమే ప్రేక్షకుల ముందుకొస్తోన్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలన్నీ తారాస్థాయిలో ఉన్నాయి. ఇక నిన్న సాయంత్రం హైద్రాబాద్‌లో ప్రమోషన్స్‌లో భాగంగా నిర్వహించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా పెద్ద హిట్ అయింది. మెగా అభిమానుల కోలాహలంతో రాజకీయ, సినీ ప్రముఖుల హాజరుతో ఈ ఈవెంట్ విజయవంతంగా జరిగింది.

ఇక దీంతో మెగా అభిమానుల పండగ సంబరం మొదలైందనే చెప్పాలి. ధృవ విడుదలైన రెండు వారాల వరకూ ఇది ఇలాగే కొనసాగనుంది. ఆ తర్వాత మళ్ళీ అభిమానుల్లో ఉత్సాహం నింపేందుకు ఏకంగా మెగాస్టార్ చిరంజీవియే రంగంలోకి దిగనున్నారు. చాలాకాలం తర్వాత ఆయన హీరోగా రీ ఎంట్రీ ఇస్తూ చేసిన ‘ఖైదీ నెం. 150’ జనవరి నెలలో సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈనెలాఖరు నుంచే ఆ సినిమా ఆడియో, ప్రమోషన్స్‌తో సందడి మొదలుపెట్టనుంది. మరో నెలపాటు ఖైదీ నెం 150 సందడి ఉంటుంది. ఇక ఈ రెండు సినిమాలూ పెద్ద హిట్స్‌గా నిలిచి తమకు సంబరాన్ని తెచ్చిపెడతాయని అభిమానులంతా ఎదురుచూస్తున్నారు.

 
Like us on Facebook