భారీగా జై సింహ ప్రీ రిలీజ్ ఈవెంట్ !

నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా జై సింహ. ఇటివల విడుదలైన ఈ సినిమా ఆడియో కు మంచి స్పందన లభిస్తోంది. నిన్న ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. యు/ఎ సట్టిఫికేట్ పొందిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 8 న జరగబోతోంది.

ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, హరిప్రియ, నఠాషా దోషిలు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. చిరతన్ భట్ సంగీతం అందించిన ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మించారు. రెండు విభిన్న పాత్రల్లో బాలయ్య కనిపించబోతున్నాడు. భారీ అంచనాల మద్య విడుదలకానున్న ఈ సినిమా కు ఎం.రత్నం కథ మాటలు అందించారు.