సమీక్ష : “జల్లికట్టు” తెలుగు డబ్ చిత్రం “ఆహా”లో ప్రసారం

సమీక్ష : “జల్లికట్టు” తెలుగు డబ్ చిత్రం “ఆహా”లో ప్రసారం

Published on Sep 25, 2020 3:49 PM IST
Jallikattu Review

Release date : September 25th, 2020

123telugu.com Rating : 3/5

నటీనటులు : ఆంటోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సబుమోన్ అబ్దుసామద్

దర్శకత్వం : లిజో జోస్ పిల్లిసెరి

నిర్మాత : ఓ. థామస్ పానికర్

సంగీతం : ప్రశాంత్ పిళ్ళై

సినిమాటోగ్రఫర్ : గిరీష్ గంగాధరన్

ఎడిటర్ : దీపు జోసెఫ్

 

 

ఈ లాక్ డౌన్ సమయంలో పలు చిత్రాలు మరియు సిరీస్ ల రివ్యూస్ తో కొనసాగిస్తున్న క్రమంలో నేడు మేము ఎంచుకున్న చిత్రం “జల్లికట్టు”. తమిళంలో మంచి హిట్ అయిన ఈ చిత్రాన్ని తెలుగులో మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ “ఆహా” వారు అందుబాటిలోకి తీసుకొచ్చారు. మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇపుడు సమీక్షలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఈ చిత్రం కేరళలోని ఒక అటవీ నగర ప్రాంతానికి చెందిన కథపై ఆధారపడి తెరకెక్కింది. విన్సెన్ట్(చెంబన్ వినోద్) ఆ అటవీ ప్రాంతంలో బీఫ్ ను అమ్ముతుంటాడు. అతను అమ్మే ఆ మాంసం అంటే అక్కడి ప్రతీ ఒక్కరూ ఎంతగానో ఇష్టపడి మరీ కొంటారు. అందులో పేద వాళ్ళు కూడా అతని దగ్గర కొనడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తుంటారు. కానీ ఒకరోజు ఆ విన్సెన్ట్ మాంసం కోసం సిద్ధం చేసిన ఒక ఎద్దు అకస్మాత్తుగా తప్పించుకుంటుంది. ఇక అక్కడ నుంచి ఎలాంటి పరిణామాలు ఆ ప్రాంతంలో అక్కడి మనుషుల్లో జరిగాయి? ఫైనల్ గా ఆ ఎద్దును పట్టుకునే ప్రక్రియ ఎలా ముగిసింది అన్నది అసలు.

 

ఏమి బాగుంది?

 

మొదటగా అసలు ఈ జల్లికట్టు అనే క్రీడకు సంబంధించిన గాథను ఆరంభంలో చూపిన విధానం చాలా బాగుంది. ఒక చిన్న కుగ్రామంలో ఈ క్రీడ ఎలా పుట్టింది అన్నది మంచి లొకేషన్స్ మరియు చూపిన విజువల్స్ చాలా సహజంగా అనిపిస్తాయి.

అలాగే నటీనటుల పెర్ఫామెన్స్ లు, నిజమైన అడవుల్లో చిత్రీకరించిన విజువల్స్ కానీ ఆ ఎద్దును పట్టుకునే క్రమంలో చూపే ఎపిసోడ్స్ కానీ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తాయి. ముఖ్యంగా అయితే ఆ ఎద్దు దాడి చేసే ఒక పర్టిక్యులర్ సన్నివేశం అయితే వేరే లెవెల్లో అనిపిస్తుంది.

వీటికి అనుగుణంగా వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ మరింత ఎలివేట్ చేస్తాయి. అలాగే ఈ చిత్రం మొదలైన సీన్ నుంచి అసలు కథలోకి తీసుకెళ్లిన విధానం బాగుంది. అలాగే కెమెరా పనితనం కానీ నిర్మాణ విలువలు చాలా బాగా అనిపిస్తాయి.

 

ఏమి బాగోలేదు?

 

ఈ చిత్రమ్ అది ఎంత ఇంపాక్ట్ కలిగిస్తుందో అదే సమయంలో కథలో చోటు చేసుకునే పరిణామాలు కానీ ఇతర పాత్రలకు సంబంధించి ఇంట్రో చేసే కోణాలు చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది. అవి ఎక్కువగా ఉన్నా పర్లేదు అనిపిస్తుంది కానీ కాకపోతే కొంచెం ఎక్కువగా ఉన్నాయని భావన కలుగుతుంది.

అలాగే అనేక పాత్రలను పరిచయం చేసిన విధానం నార్మల్ ఆడియెన్స్ కు ఒక విధంగా కాస్త గజిబిజిగా అనిపించొచ్చు. ఒక్కసారి చూసిన వెంటనే ఈ సన్నివేశాలు అర్ధం కాకపోవచ్చు. అలాగే ఒక కథ పతాక సన్నివేశంలో ఉన్నపుడు కథ అలాగే ఒకే దగ్గర ఉండిపోయినట్టు అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్ కు వచ్చే సరికి రోల్ అయ్యే సన్నివేశాలు అంత డిటైల్డ్ గా ఉన్నట్టు అనిపించదు. అలాగే ఆ గ్రామస్థులు ఆ ఎద్దును పట్టుకునే పలు సన్నివేశాలు కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి.

 

చివరి మాటగా :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయితే ఈ జల్లికట్టు చిత్రం చాలా యూనిక్ గా అద్భుతమైన పెర్ఫామెన్స్ లు మరియు సహజమైన ఎపిసోడ్స్ తో చాలా ఆసక్తికరంగా మరియు సూపర్బ్ గా అనిపిస్తాయి. అలాగే ఈ చిత్రంలో చాలా వరకు రన్ టైం మంచి రసవత్తరంగా ఉంటుంది, అలాగే ఈ చిత్రం సాధారణమైనది కూడా కాకపోవడం ఈ చిత్రంపై ఆసక్తి కలిగిస్తుంది. జస్ట్ కొన్ని ఫ్లాన్ ను పక్కన పెడితే ఖచ్చితంగా ఈ వారాంతంతో చూడడానికి మంచి ఆప్షన్ గా నిలుస్తుంది.

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం

తాజా వార్తలు