ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘జనతా గ్యారేజ్’

janatha-garage-2
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషనలో ఎమోషనల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ‘జనతా గ్యారేజ్’ చిత్రం కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన రోజు మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ ప్రేక్షకులు సినిమాని బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారు. నిన్న నాలుగవరోజుకు నైజాంలో రూ. 11.6 కోట్లు, సీడెడ్ లో రూ.6. 3 కోట్లు, ఈస్ట్ రూ. 311 కోట్లు, వెస్ట్ రూ. 2.67 కోట్లు, వైజాగ్ రూ. 4.10 కోట్లు, కృష్ణా రూ. 2.72 కోట్లు, గుంటూరు రూ. 3. 83 కోట్లు, నెల్లూరు రూ. 1.33 కోట్లు, కర్ణాటక రూ. 5.67 కోట్లు, కేరళ రూ.1.20 కోట్లు, యూఎస్ 6.06 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 1.45 కోట్లు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ రూ.1.60 కోట్లు కలుపుకుని మొత్తం నాలుగు రోజులకు ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.52 కోట్లు వసూలు చేసింది .

దీంతో ఎన్టీఆర్ కెరీర్లోనే వసూళ్ల పరంగా ఇదే మొదటి స్థానంలో నిలవనుంది. అలాగే తెలుగు పరిశ్రమలో బాహుబలి తరువాత అంట వేగంగా 50 కోట్ల మార్క్ అందుకున్న చిత్రం కూడా ఇదే కావడం విశేషం. ఎన్టీఆర్, మోహన్ లాల్ ల నటన, కొరటాల శివ ఎమోషనల్ స్క్రీన్ ప్లే సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచి చిత్రాన్ని ముందుకు నడిపిస్తున్నాయి. ఇకపొయే ఈరోజు కూడా సెలవు కావడంతో ఈ కలెక్షన్లు ఇలాగే కొనసాగే అవకాశముంది.