నైజాంలో బ్రేక్‌ ఈవెన్‌కు దగ్గరైన ‘జనతా గ్యారెజ్’!

Janatha-Garage
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘జనతా గ్యారెజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తూ దూసుకుపోతోన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల నడుప గత గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, ఆ అంచనాలను అందుకొని మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. కేవలం ఐదు రోజుల్లో ఏపీ, తెలంగాణాల్లో కలుపుకొని 40 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడం ఎన్టీఆర్ కెరీర్‌కే రికార్డుగా నిలిచింది. ఇక ముఖ్యంగా నైజాం ఏరియాలో కలెక్షన్స్ అదిరిపోయే స్థాయిలో ఉన్నాయనే చెప్పుకోవాలి.

నైజాంలో మొదటి ఐదురోజుల్లో ఈ సినిమా 13.44 కోట్ల రూపాయల షేర్ రాబట్టింది. సుమారు 15 కోట్ల రూపాయలకు నైజాం ఏరియా హక్కులు అమ్ముడవగా, నేటితో సినిమా దాదాపుగా బ్రేక్ ఈవెన్ చేరుతుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. దీంతో మరో రెండు రోజుల్లో నైజాంలో ‘జనతా గ్యారెజ్’ లాభాల బాట పట్టనుందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు. మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ చేసిన ఓ ప్రధాన పాత్ర సినిమాకు హైలైట్‌గా నిలిచింది.