కలెక్షన్స్ రిపోర్ట్ : 70 కోట్ల క్లబ్‌లో ‘జనతా గ్యారేజ్’!

Janatha-Garage
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ కొరటాల శివల కాంబినేషన్‌లో వచ్చిన ‘జనతా గ్యారెజ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోన్న విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్యన సెప్టెంబర్ 1న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే పలుచోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించి ఎన్టీఆర్ కెరీర్లోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది. ఇక నిన్నటితో బాక్సాఫీస్ వద్ద పది రోజులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ పదిరోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 70 కోట్ల రూపాయల షేర్ వసూలు చేయడం విశేషంగా చెప్పుకోవచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక కర్ణాటక, యూఎస్‌లలో సినిమా సూపర్ కలెక్షన్స్ సాధించింది. ఇక తాజాగా రెండు కొత్త సన్నివేశాలను జత చేయడంతో కలెక్షన్స్ పెరిగే సూచనలున్నాయని ట్రేడ్ భావిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించగా, మళయాల సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించారు.

ప్రాంతాల వారీగా జనతా గ్యారేజ్ సాధించిన కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి..

ఏరియా కలెక్షన్స్ (షేర్)
నైజాం 15.57 కోట్లు
సీడెడ్ 9.16 కోట్లు
వైజాగ్  5.92 కోట్లు
తూర్పు గోదావరి  4.10 కోట్లు
పశ్చిమ గోదావరి 3.52 కోట్లు
కృష్ణా 3.70 కోట్లు
గుంటూరు 4.94 కోట్లు
నెల్లూరు 1.83 కోట్లు
కర్ణాటక 7.73 కోట్లు
కేరళ 2.35 కోట్లు
యూఎస్ఏ 7.35 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.48 కోట్లు
రెస్ట్ ఆఫ్ వరల్డ్ 2.20 కోట్లు
మొత్తం
70.85 కోట్లు