‘జనతా గ్యారెజ్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్!

‘జనతా గ్యారెజ్’ లేటెస్ట్ యూఎస్ కలెక్షన్స్!

Published on Sep 2, 2016 6:50 PM IST

Janatha-Garage
యంగ్ టైగర్ ఎన్టీఆర్ – దర్శకుడు కొరటాల శివల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘జనతా గ్యారెజ్’ సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన విషయం తెలిసిందే. తారాస్థాయి అంచనాల మధ్యన విడుదలైన ఈ సినిమాలో ఎన్టీఆర్ ఎమోషనల్ పాత్రకు, ప్రధాన పాత్రలో నటించిన మోహన్ లాల్ పాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇక మొదటిరోజే సినిమాను చూసేయాలని ఎప్పట్నుంచో ఎదురుచూస్తోన్న అభిమానులంతా ఎన్టీఆర్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిపెట్టారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలోనూ ఈ సినిమాకు అదిరిపోయే కలెక్షన్స్ వచ్చాయి. యూఎస్ బాక్సాఫీస్ వద్ద ప్రీమియర్ షోస్, మరియు గురువారం రోజు కలెక్షన్స్ కలుపుకొని ‘జనతా గ్యారెజ్’ 736కే డాలర్లు వసూలు చేసింది. శుక్ర, శని, ఆదివారాల లాంగ్ వీకెండ్ ఉండడంతో మున్ముందు కలెక్షన్స్ ఇంకా బాగుంటాయని ట్రేడ్ భావిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో సమంత, నిత్యా మీనన్‌లు హీరోయిన్లుగా నటించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు