అచ్చం శ్రీదేవిలానే ఉందట !

Published on Jul 3, 2018 5:29 pm IST

అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. జాన్వి తన ఇన్‌స్టాగ్రామ్‌ లో ఒక ఫోటోను షేర్‌ చేసింది. ఆ ఫోటో కేవలం రెండు గంటల్లోనే 2 లక్షల లైక్స్ తో పాటుగా వేలల్లో కామెంట్స్‌ ను సొంతం చేసుకుంది. కారణం ఆ ఫోటో చూసిన వాళ్ళకి శ్రీదేవి గుర్తుకొస్తున్నారట. దాంతో అభిమానులు జాన్వీకి అచ్చం శ్రీదేవిలానే ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇంకొంతమంది ‘మీలో శ్రీదేవిగారిని చూస్తున్నామని’ కామెంట్‌ పెట్టగా, మరికొందరు ‘మీ అమ్మగారు మీ రూపంలో జీవించే ఉన్నారని కామెంట్‌ పెట్టారు. ఈ నెల 20న జాన్వికపూర్ ‘ధడక్‌’ చిత్రంతో బాలీవుడ్‌ కి పరిచయం కాబోతుంది. ప్రస్తుతం ఆమె ఆ చిత్ర ప్రమోషన్‌ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో జాన్వీ సరసన ఇషాన్‌ ఖట్టర్‌ హీరోగా నటిస్తున్నాడు. శశాంక్‌ ఖైటన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకనిర్మాత కరణ్‌ జోహర్‌ ‘ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌’ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం :