‘జవాన్’ కృష్ణ, ఉత్తరాంధ్ర లేటెస్ట్ కలెక్షన్లు !
Published on Dec 3, 2017 11:16 am IST

మెగాహీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’ గత శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంతో తేజ్ తన కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్నారు. మొదటిరోజు మిక్స్డ్ టాక్ ఏర్పడ్డా నిన్న శనివారం చిత్ర కలెక్షన్లు మెరుగ్గానే ఉన్నాయి. ప్రధాన ఏరియాలైన కృష్ణా జిల్లాలో చూసుకుంటే మొదటిరోజు రూ. 18.81 లక్షల షేర్ ను రాబట్టిన ఈ చిత్రం రెండవ రోజు రూ.12.60 లక్షల షేర్ ను వసూలు చేసి మొత్తంగా రూ.31.40 లక్షల షేర్ ను ఖాతలో వేసుకుంది.

అలాగే మరొక ముఖ్యమైన రీజియన్ ఉత్తరాంధ్రలో రూ.23.35 లక్షల షేర్ తో రెండు రోజులకు కలిపి రూ. 58.45 లక్షల షేర్ రాబట్టుకుందీ చిత్రం. ఇక ఈరోజు ఆదివారం కావడంతో ఈ వసూళ్లు ఇలాగే స్టడీగా కొనసాగే అవకాశముంది. దర్శకుడు బివిఎస్. రవి డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని కృష్ణ నిర్మించగా దిల్ రాజు సమర్పించారు. ఇందులో తేజ్ కు జోడీగా లక్కీ హీరోయిన్ మెహ్రయిన్ కౌర్ నటించింది.

 
Like us on Facebook