ప్రీమియర్లతో సిద్దమవుతున్న ‘జవాన్’!
Published on Nov 30, 2017 11:00 am IST

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం ‘జవాన్’ రేపు డిసెంబర్ 1న విడుదలకానున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలతో ఆకట్టుకున్న ఈ చిత్రంపై ప్రేక్షక వర్గాల్లో మంచి అంచనాలున్నాయి. టీమ్ కూడా సినిమా విజయంపై ధీమాగా ఉన్నారు. అందుకే ఈరోజు 30వ తేదీ రాత్రి నుండే ప్రీమియర్లను ప్లాన్ చేశారు.

ఈరోజు రాత్రి 7 గంటల నుండి హైదరాబాద్లోని శ్రీరాములు థియేటర్లో ప్రీమియర్లు ప్రదర్శితంకానున్నాయి. ఈ సినిమా విజయంపై హీరో ధరమ్ తేజ్ తో పాటు దర్శకుడు బివిఎస్ రవి కూడా మంచి అంచనాలను పెట్టుకున్నారు. వాళ్ళ అంచనాల మేరకు ఈ ప్రీమియర్ల ద్వారా పాజిటివ్ టాక్ స్ప్రెడ్ అయితే సినిమా విజయం దాదాపు ఖాయమైనట్టే. లక్కీ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ధరమ్ తెజ్ కు జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

 
Like us on Facebook