జయలలిత బయోపిక్ లో శోభన్ బాబు సంగతి ఏంటి ?

Published on Dec 13, 2018 3:47 pm IST

తమిళ దర్శకురాలు ప్రియదర్శిని ‘ది ఐరన్ లేడీ’ అనే టైటిల్ తో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితగారి జీవితం ఆధారంగా బయోపిక్ ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. జయలలితగారి పాత్రలో టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తోంది. ఇటీవలే జయలలిత పాత్రలో ఉన్న నిత్యా మీనన్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది చిత్రబృందం.

కాగా ఈ లుక్ లో నిత్యా మీనన్ అచ్చం జయలలిత లాగా కనిపిస్తూ ఆకట్టుకుంది. అయితే జయలలిత జీవితంలో చోటు చేసుకున్న పలు ఆసక్తికరమైన మరియు వివాదాస్పదమైన విషయాలను కూడా బయోపిక్ లో చూపిస్తారా లేదా అన్న సంగతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ముఖ్యంగా జయలలిత బయోపిక్ లో అలనాటి అందాల హీరో శోభన్ బాబు గురించి ప్రస్తావిస్తారా లేదా. ప్రస్తావించకపోతే అప్పుడు బయోపిక్ పరిపూర్ణం కానట్లే. ఒకవేళ ప్రస్తావిస్తే జయలలిత అభిమానులు మనోభావాలు దెబ్బతింటాయని కూడా చిత్రబృందం భావిస్తోంది. ఈ క్రమంలో శోభన్ బాబు పాత్రను కేవలం అతిధి పాత్రలానే చూపించి ముగించాలని చిత్రబృందం నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ బయోపిక్ ఫిబ్రవరి 24వ తేదీన జయలలిత జయంతి సందర్భంగా లాంచ్ కానుంది. లైకా ప్రొడక్షన్స్ ఈ బయోపిక్ ని నిర్మించనుంది. ఇప్పటికే జయలలిత పాత్ర కోసం నిత్యామీనన్ ప్రత్యేకంగా బరువు కూడా పెరిగింది. మరి జయలలిత పాత్రలో నిత్యామీనన్ ఎలా నటిస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :