రివ్యూ : జోహార్ – తెలుగు చిత్రం(ఆహా)

విడుదల తేదీ : ఆగస్టు 14, 2020

123telugu.com Rating : 3/5

నటీనటులు : నైనా గంగూలీ, ఈస్తర్ అనిల్, కృష్ణ చైతన్య

దర్శకుడు : తేజ మర్ని

 

 

గత కొన్ని నెలల కితమే పోస్టర్స్ తోనే మంచి పాజిటివ్ బజ్ ను సంతరించుకున్న చిత్రం “జోహార్”. అలాగే ఇటీవలే విడుదల చేసిన టీజర్ మరియు ట్రైలర్లతో కూడా ఆకట్టుకుని ఇపుడు నేరుగా స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ “ఆహా” లో అందుబాటిలోకి వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం రండి.

 

కథ :

 

ఈ చిత్రంలో మొత్తం ఐదు భిన్నమైన కథలతో కొనసాగుతుంది, ఓ యువ ముఖ్యమంత్రి(కృష్ణ చైతన్య) తన తండ్రి జ్ఞ్యాపకార్ధం ఒక భారీ విగ్రహాన్ని తన అధికారం ద్వారా నిర్మించాలని పరితపిస్తాడు. అలాగే మరో పక్క ఓ పేద రైతు(ఈశ్వరి రావ్), అథ్లెట్(నైనా గంగూలీ), ఓ టీనేజ్ యువతి (ఈస్తర్) అలాగే ఓ అనాథశ్రయాన్ని నడిపే ముసలాయన(శుభలేఖ సుధాకర్) ల జీవితాలకు ఏమన్నా సంబంధం ఉందా? అతని వల్ల వీరికేమయ్యింది? అలా ఏర్పడిన రాజకీయ పరిణామాలు ఎటు దారి తీశాయి అన్నది అసలు కథ.

 

ప్లస్ పాయింట్స్ :

 

ఈ చిత్రంలో అన్నిటికన్నా మేజర్ ప్లస్ పాయింట్ ఏదన్నా ఉంది అంటే అది ఎమోషన్స్ చెప్పాలి. సినిమా మొదటి నుంచి చివరి కొనసాగే బలమైన ఎమోషన్స్ చాలా బావుంటాయి. అలాగే ఒకరి కథకు మరొకరి కథ లింకప్ అయ్యి ఉన్న విధానం మెప్పిస్తుంది. అలాగే ఈ చిత్రం ద్వారా వారు అందించిన సందేశం కూడా బాగా వచ్చింది అని చెప్పాలి.

ఇక నటీనటుల విషయానికి వస్తే ఇప్పటికే ఎన్నో చిత్రాల్లో నటించిన కృష్ణ చైతన్య ఈ చిత్రంలో ఓ రాజకీయ నాయకునిగా ఎలా కనిపించాలో అలా కనిపించి ఆకట్టుకున్నాడు. అలాగే అతని నటన మరో మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. అలాగే సీనియర్ నటులు శుభలేఖ సుధాకర్ మరియు ఈశ్వరి రావ్ తమ ఎమోషనల్స్ పెర్ఫామెన్స్ ద్వారా తమ పాత్రలకు సంపూర్ణ న్యాయం చేకూర్చారు.

అలాగే యువ నటి ఈస్తర్ కూడా తన రోల్ ను చాలా క్లీన్ గా చేసింది. ఇక నైనా గంగూలీ విషయానికి వస్తే ఇప్పటి వరకు గ్లామరస్ రోల్స్ లో కనిపించిన ఈమె ఈ చిత్రం ద్వారా ఒక సరికొత్తగా ఆమెను ఆవిష్కరించుకుంది అని చెప్పాలి. అలా తన పెర్ఫామెన్స్ తో నైనా మరో హైలైట్ అయ్యిందని చెప్పాలి. అలాగే నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. సినిమాలో చూపించిన ప్రతీ లొకేషన్స్ లో కెమెరా పనితనం చాలా బాగుంది.

 

మైనస్ పాయింట్స్ :

 

ఈ చిత్రం ఫస్ట్ హాఫ్ అంతా బాగా కొనసాగుతూ వస్తుంది. కానీ సెకండాఫ్ విషయానికి వస్తే అలా కాస్త నెమ్మదించిన అభిప్రాయం కలుగుతుంది. అలాగే కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో అయితే చాలా వరకు ఆడియన్స్ ఊహించగలిగిన విధంగానే ఉంటాయి.

అలాగే ప్రభుత్వంలో ఉండే అధికారులు తమ పవర్ ను ప్రజలకు కాకుండా తమ అవసరాలకు ఎలా వినియోగించుకుంటున్నారు అన్నది కూడా ఇంకా బలంగా ఎలివేట్ అయ్యి ఉంటే ఇంకా ఇంపాక్ట్ ఉండేది.

అలాగే దర్శకుడు ప్రతీ ఒక్కరి కథలను బాగా చూపించి నడిపించారు కానీ కథానుసారం వచ్చే ట్విస్టుల విషయంలో మరింత జాగ్రత్త వహించి ఉండాల్సింది. ఇవన్నీ కాస్త నిరాశ కలిగించే అంశాలు అని చెప్పొచ్చు.

 

సాంకేతిక విభాగం :

 

మొట్టమొదటిగా ఈ సినిమా క్రెడిట్ దర్శకుడు తేజ మర్ని కి ఇవ్వాలి. తాను ఎంచుకున్న క్యాస్టింగ్ లో ప్రతీ ఒక్కరి నుంచి ది బెస్ట్ పెర్ఫామెన్స్ ను రాబట్టి చిత్రానికి ప్రధాన బలంగా నిలిపాడు. అలాగే ఎమోషన్స్ ను క్యారీ చేసి విషయంలో అయితే మరిన్ని మార్కులు వెయ్యొచ్చు. అలాగే పాటలు మరియు కథానుసారం రాసుకున్న డైలాగ్స్ అర్ధవంతంగా బాగున్నాయి.

ఇంతకు ముందు చెప్పుకున్నట్టుగానే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. అలాగే కెమెరా పనితనం కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆడియన్స్ ను ఖచ్చితంగా మెప్పిస్తాయి. అలాగే పొలిటికల్ గా దర్శకుడు కథనం పరంగా చెప్పిన కొన్ని అంశాలు కూడా బాగుంటాయి.

 

తీర్పు :

 

ఇక మొత్తంగా చూసుకున్నట్టయతే జోహార్ చిత్రం ఆకట్టుకునే ఒక ఎమోషనల్ డ్రామా అని చెప్పాలి. తమ పర్సనల్ ఎజెండా కొరకు ప్రజల సమస్యలను గాలికొదిలేసి కొందరు రాజకీయ పార్టీలపై డైరెక్ట్ గా సెటైర్ తో చూపించారు. అలాగే దర్శకుడు ఎన్నుకున్న కాన్సెప్ట్ కానీ చూపించిన కథలు కానీ ఆకట్టుకుంటాయి. కానీ కాస్త నెమ్మదిగా సాగే సెకండాఫ్ కొంచెం ముందు గానే ఊహించగలిగే కొన్ని సన్నివేశాలు అలాగే ఇచ్చే ఓ సామాజిక సందేశం ద్వారా డీసెంట్ గా నడిచే ఈ చిత్రాన్ని ఓసారి చూడొచ్చు.

 

123telugu.com Rating : 3/5
Reviewed by 123telugu Team

Click Here For English Review

సంబంధిత సమాచారం :

More