అతని రాక కోసం చాలా ఆసక్తిగా చూస్తున్న తారక్ అభిమానులు.!

Published on Aug 18, 2021 6:01 pm IST

ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ మల్టీ స్టారర్ చిత్రం అయినటువంటి “రౌద్రం రణం రుధిరం”లో నటిస్తున్న సంగతి తెలిసిందే.. అలాగే ఈ చిత్రం తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివతో మరో చిత్రాన్ని ప్లాన్ చేసుకున్నాడు. మరి ఇది కూడా పాన్ ఇండియన్ లెవెల్లోనే భారీ హంగులతో తెరకెక్కనుంది.

అయితే ఈ చిత్రంకి గాను సంగీత దర్శకునిగా సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ పేరు ఫిక్స్ అయ్యింది అన్న నాటి నుంచి బజ్ ఇంకో లెవెల్ కి వెళ్ళింది. దీనితో అనిరుద్ రాక కోసం తారక్ అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. అప్పుడు అరవింద సమేత కు మిస్సయిన ఈ మాస్ కాంబో నుంచి అధికారిక అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూస్తున్నారు. మంచి మోస్ట్ అవైటెడ్ గా మారిన ఈ అప్డేట్ మరి ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :