NTR 30 లేటెస్ట్ అప్ డేట్ : షూటింగ్ మొదలయ్యేది అప్పటి నుండే ?

NTR 30 లేటెస్ట్ అప్ డేట్ : షూటింగ్ మొదలయ్యేది అప్పటి నుండే ?

Published on Feb 1, 2023 12:30 AM IST

టాలీవుడ్ నటుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో అతి త్వరలో పెట్టాలెక్కనున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియా మూవీ NTR 30. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధా ఆర్ట్స్ సంస్థలపై ఎంతో భారీ వ్యయంతో గ్రాండ్ గా రూపొందనున్న ఈ మూవీకి యువ మ్యూజికల్ సెన్సేషన్ అనిరుద్ సంగీతం అందించనుండగా టాలీవుడ్ కి చెందిన పలువురు ముఖ్య నటులు ఇందులో కీలక పాత్రలు పోషించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఇటీవల రిలీజ్ అయిన NTR 30 మూవీ ఫస్ట్ గ్లింప్స్ టీజర్ కి అందరి నుండి మంచి రెస్పాన్స్ లభించింది.

భారీ మాస్ యాక్షన్ తో కూడిన కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ షూటింగ్ ఫిబ్రవరి నెలాఖరు నుండి ప్రారంభం కానుందట. అనంతరం మార్చి నుండి హైదరాబాద్ లో ఒక భారీ షెడ్యూల్ ని ప్లాన్ చేసిన యూనిట్, ఆ తరువాత గోవా లో నెక్స్ట్ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ కోసం ప్రస్తుతం హైదరాబాద్ లోని శంషాబాద్ ఏరియాలో ఒక భారీ సెట్ వర్క్ కూడా జరుగుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా అతి త్వరలో NTR 30 మూవీ షూటింగ్ ప్రారంభం కానుండడం అలానే ఆపైన వీలైనంత త్వరగా మూవీ యొక్క అప్ డేట్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ కానుండడం ఖాయం అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు