ఫ్యాన్సీ నంబర్ కోసం తారక్ ఎంత ఖర్చు పెట్టాడంటే?

Published on Sep 23, 2021 1:26 am IST


చాలా మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు, వీఐపీలు తమ తమ వెహికిల్స్‌కి ఒకే విధమైన ఫ్యాన్సీ నెంబర్లను పెట్టుకుంటుంటారు. ఇందుకోసం భారీగానే ఖర్చు చేస్తుంటారు. అయితే ఈ జాబితాలో జూనియర్‌ ఎన్టీఆర్‌ కూడా ఉన్నారండోయ్. ఇటీవల అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారును ప్రత్యేకంగా ఇటలీ నుంచి తెప్పించుకున్నాడు తారక్. అయితే ఈ కారు కొనేందుకు తారక్ కోట్లు ఖర్చు పెడితే, ఫ్యాన్సీ నంబర్ కోసం లక్షలు ఖర్చు చేశాడు.

తాజాగా ఖైరతాబాద్‌ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లను వేలం వేయగా TS 09 FS 9999 నంబర్‌ను తారక్ రూ.17 లక్షలు పెట్టి దక్కించుకున్నాడు. అయితే ఎన్టీఆర్‌ దగ్గరున్న కార్లకు అన్నింటికీ 9999 నంబర్‌ ఉంటుంది. ఈ నంబర్ వెనుక అసలు కారణం ఏమిటంటే తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు కారు నంబర్ 9999 అని, తండ్రి హరికృష్ణ కూడా అదే నంబర్ కారును వాడారని, అందుకే నాకు ఆ నెంబర్‌ ఇష్టమని తారక్ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :