ఆంజనేయ స్వామి దీక్ష చేపట్టబోతున్న ఎన్టీఆర్..!

Published on Apr 12, 2022 9:42 pm IST

జూనియర్ ఎన్టీఆర్ వెండితెరకు నటుడిగా పరిచయమై నిన్నటితో పాతికేళ్లు పూర్తి అయ్యింది. తాత స్వర్గీయ ఎన్‌టీరామారావు హావాభావాలు ఉట్టిపడేలా తన నటన, డైలాగ్ డెలివరీ, డ్యాన్స్‌తో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఇటీవలే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”లో నటించాడు. ఈ సినిమాతో ఎన్టీఆర్ క్రేజ్ మరింత పెరిగిపోయింది.

అయితే ఆర్ఆర్ఆర్ వంటి భారీ సక్సెస్ రావడం కాబోలు జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు భక్తి మార్గం పట్టాడు. బుధవారం నుండి 21 రోజుల పాటు ఆంజనేయ స్వామి దీక్ష చేపట్టబోతున్నాడు. సాధారణంగా స్వామి దీక్షలకు ఎన్టీఆర్ ముందు నుంచి దూరంగానే ఉంటాడని మనకి తెలుసు. కానీ ఎన్టీఆర్ ఇప్పుడు ఆంజనేయ స్వామి దీక్షకు దిగుతుండడం అటు అభిమానుల్లో, ఇటు ఇండస్ట్రీలో ఆసక్తిగా అనిపిస్తుంది.

సంబంధిత సమాచారం :