మామయ్య, లోకేశ్ త్వరగా కోలుకోవాలి – జూనియర్ ఎన్టీఆర్

Published on Jan 18, 2022 9:25 pm IST

టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు నారా లోకేశ్ కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అయితే వీరు త్వరగా కోలుకోవాలని పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. అయితే తాజాగా చంద్రబాబు నాయుడు, లోకేశ్ త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు.

ఈ మేరకు ట్విట్టర్ ద్వారా స్పందించిన జూనియర్ ఎన్టీఆర్ “మామయ్య చంద్రబాబు, లోకేశ్” త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ చేసిన ఈ ట్వీట్ అటు నందమూరి అభిమానుల్లో మరియు టీడీపీ కార్యకర్తల్లో ఫుల్ జోష్‌ని నింపింది. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది.

సంబంధిత సమాచారం :