గోపీచంద్ “జ్వాలారెడ్డి” ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది..!

Published on Oct 27, 2021 1:51 am IST


టాలీవుడ్ మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం “సీటిమార్”. కబడ్డీ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్‌గా నటించింది. శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ చిత్రం వినాయక చవితి కానుకగా సెప్టెంబర్ 10న మంచి అంచనాల నడుమ విడుదలై సూపర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది.

ఇక ఈ సినిమాలోని మాస్ బీట్‌తో యువతను ఉర్రూతలూగించిన “జ్వాలా రెడ్డి” పాట ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. ఈ పాటకు యూట్యూబ్‌లో మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ఈ చిత్రంలో భూమిక చావ్లా, దిగంగణ సూర్య వంశీ, రేహమాన్, అప్సర రాణి, రావు రమేష్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More