గోపీచంద్ సినిమా కోసం సింగర్ గా మారిన దర్శకుడి భార్య !

17th, September 2017 - 04:28:23 PM


మ్యాచో మాన్ గోపీచంద్ చేసిన చిత్రాల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన ‘ఆక్సిజన్’. షూటింగ్ ఆలస్యం కావడం వలన ఇన్నాళ్లు వాయిదాపడుతూ వచ్చిన ఈ చిత్రం ఎట్టకేలకు దీపావళి కానుకగా అక్టోబర్ 12న రిలీజ్ కానుంది. ఈ చిత్రం కోసం దర్శకుడు జ్యోతికృష్ణ భార్య ఐశ్వర్య గాయనిగా మారారు. స్వతహాగా మంచి గాత్రం కలిగిన ఐశ్వర్య పలు అవకాశాలు వచ్చినా పాడలేదు.

కానీ జ్యోతికృష్ణ సలహా మేరకు ఈ చిత్రంతో సింగర్ గా ఆరంగేట్రం చేస్తున్నారామె. ఈ ఆల్బమ్ లో ఐశ్వర్య రెండు పాటల్ని పాడారట. వాటిలో ఒక ఫ్యామిలీ సాంగ్ కూడా ఉందట. ఇప్పటికే పాటల రికార్డింగ్ కూడా పూర్తైందని, పాటలు ప్రేక్షకులకు తప్పక నచ్చుతాయని జ్యోతికృష్ణ అన్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రాశి ఖన్నా, అను ఇమ్మాన్యుయల్ హీరోయిన్లుగా నటించారు.