భారీ తనం, భారీ విజువల్స్ తో తెరకెక్కుతున్న సినిమా రోబో. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్, అమీ జాక్షన్ నటిస్తోన్న ఈ సినిమా ఏప్రిల్ లో విడుదల కానుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. కాని తాజా సమాచారం మేరకు ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రావడం లేదని తెలుస్తోంది.
ఈ సినిమా స్థానంలో రజినీకాంత్ నటించిన కాలా సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నట్లు వస్తున్నాయి. రోబో సినిమా స్థానంలో కాలా రావడం విశేషం. దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న కాలా సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీకాంత్ డిఫరెంట్ లుక్ లో అభిమానుల్ని అలరించంబోతున్నాడు.


