కథనం ట్రైలర్: సస్పెన్సు క్రైమ్ డ్రామా

Published on Aug 3, 2019 5:43 pm IST

జబర్దస్త్ ఫేమ్ అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “కథనం”. అనసూయ ఈ చిత్రంలో రచయితగా కనిపిస్తుండగా దర్శకుడు రాజేష్ నాదెండ్ల క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిస్తున్నాడు. గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్ పై నరేంద్రారెడ్డి బత్తెపాటి,శర్మ చుక్క సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ధన్ రాజ్,వెన్నెల కిషోర్, శ్రీనివాస్ అవసరాల,సంపూర్ణేష్ వంటి నటులు నటిస్తుండగా ఈ నెల 9న విడుదల కానుంది.

సినిమా కథలు రాసుకొని డైరెక్టర్ గా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న అనసూయ అనుకోకుండా వరస హత్యలకు సంబధించిన కేసులో కీలకంగా మారుతుంది. అసలు ఆ హత్యల వెనకున్నది ఎవరు, ఆ హత్యలకు అనసూయకు ఉన్న సంబంధం ఏమిటీ అన్నది ప్రధాన కధాంశంగా ఈ మూవీ తెరకెక్కినట్లు ట్రైలర్ చుస్తే అర్థం అవుతుంది.

ఈ మూవీలో అనసూయ యాక్షన్ సన్నివేశాలలో కూడా నటించారు అనిపిస్తుంది. ఇక వెన్నెల కిషోర్,ధన్ రాజ్, సంపూర్ణేష్ బాబు కమెడియన్స్ గా కనిపిస్తున్నారు. సీనియర్ హీరో పృథ్వి రాజ్ ఈ చిత్రంలో ప్రతినాయకుడి పాత్ర చేసినట్లున్నారు. మొత్తంగా “కథనం” ట్రైలర్ ఆసక్తికరంగా సాగింది.

వీడియో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :