రామ్ చరణ్ టీంతో జత కలిసిన కాజల్

Published on Feb 9, 2014 12:20 pm IST

kajal-aggarwal
కాజల్ అగర్వాల్ చాలా రోజుల గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ షూటింగ్ లో అడుగుపెట్టింది. కాజల్ రామ్ చరణ్ హీరోగా, కృష్ణవంశీ డైరెక్షన్ లో చేయనున్న సినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతోంది. త్వరలోనే ఈ చిత్ర టీం ఓ లాంగ్ షెడ్యూల్ కోసం రామేశ్వరం వెళ్లనుంది.

ఈ సినిమాతో కాజల్ అగర్వాల్ రామ్ చరణ్ సరసన నాలుగోసారి జోడీ కట్టనుంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన ‘మగధీర’, ‘నాయక్’ మరియు ‘ఎవడు’ సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీలో రాజ్ కిరణ్, శ్రీ కాంత్, కమలినీ ముఖర్జీ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇటీవలే ఈ సినిమా గురించి మాట్లాడిన కృష్ణవంశీ ‘ ఈ సినిమా స్టొరీ చాలా బాగా వచ్చింది. సినిమా అందరికీ గుర్తుండిపోయేలా ఉంటుందని’ అన్నాడు.

బండ్ల గణేష్ నిర్మిస్తున్న ఈ సినిమాని పొల్లాచ్చి, నాగేర్కిల్, రామేశ్వరం తదితర ప్రాంతాల్లో షూట్ చేయనున్నారు. థమన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.

సంబంధిత సమాచారం :