ఒకే రోజు రెండు చిత్రాలు విడుదల చేయనున్న కాజల్

Published on Jul 17, 2019 11:05 am IST

కాజల్ అగర్వాల్ తాజాగా నటిస్తున్న రెండు చిత్రాలు ఆగస్టు 15న విడుదల కానున్నాయి. అందులో ఒకటి శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న “రణరంగం” మూవీ కాగా రెండు జయం రవి హీరోగా తెరకెక్కుతున్న తమిళ “కోమలి” . ఈ రెండు చిత్రాలు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న విడుదల కానున్నాయి.

“రణరంగం” సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, శర్వానంద్ గ్యాంగ్ స్టర్ రోల్ చేస్తున్నారు,కాజల్ తో పాటు,కళ్యాణి ప్రియదర్శన్ మరో హీరోయిన్ గా చేస్తున్నారు. ఈ మూవీ ఆగస్టు 2న విడుదల కావాల్సివుండగా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తికాకపోవడంతో 15కి వాయిదావేయడం జరిగింది.

అలాగే జయం రవి హీరోగా ప్రదీప్ రంగరాజన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “కోమలి” చిత్రం కూడా ఆగస్టు 15నే విడుదల కానుంది. వివిధ జెనరేషన్స్ కి చెందిన అవతారాలలో విడుదలైన జయం రవి పోస్టర్స్ మూవీ పై ఆసక్తిని రేపుతున్నాయి. ఇది ఓ వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కుతోందని సమాచారం.
వీటితో పాటు “క్వీన్” హిందీ చిత్రానికి తమిళ రీమేక్ గా తెరకెక్కుతున్న పారిస్ పారిస్ చిత్రంలో కూడా కాజల్ నటిస్తున్నారు.

సంబంధిత సమాచారం :