ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “డెవిల్”.!

ఓటిటి పార్ట్నర్ ని లాక్ చేసుకున్న “డెవిల్”.!

Published on Dec 29, 2023 10:00 AM IST

నందమూరి వారి టాలెంటెడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “డెవిల్”. మరి కొన్ని నిజ జీవిత సంఘటనలు ఆధారంగా తెరకెక్కించిన ఈ స్పై థ్రిల్లర్ భారీ హంగులతో నిర్మించబడింది. ఇక ఎట్టకేలకి ఇవాళ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం ఓటిటి హక్కులకు సంబంధించి ఇప్పుడు న్యూస్ అయితే ఒకటి కన్ఫామ్ అయ్యింది.

ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో వారు కొనుగోలు చేశారు. దీంతో ఈ సినిమా పోస్ట్ థియేట్రికల్ రిలీజ్ ప్రైమ్ వీడియోలో వీక్షించవచ్చు. ఇక ప్రస్తుతానికి అయితే ఈ చిత్రాన్ని థియేటర్స్ లోనే చూసి ఎంజాయ్ చెయ్యాలి. ఇక ఈ చిత్రానికి హర్ష వర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించగా నిర్మాత అభిషేక్ నామ నిర్మాణం సహా పలు సన్నివేశాలకి దర్శకత్వ భాద్యతలు కూడా తీసుకున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు