త్వరలో కళ్యాణ్ రామ్ సినిమా టైటిల్ ప్రకటన !

జయేంద్ర దర్శకత్వంలో కళ్యాణ్ రామ్, తమన్నాతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నాడు. పిసి.శ్రీరాం ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ ను 8 న అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్‌, కూల్‌ బ్రీజ్‌ సినిమాస్‌ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండడం విశేషం. శరత్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నాడు.

ఈ సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ ఉపేంద్ర మాధవ్ దర్శకత్వంలో ఎంఎల్ఎ అనే సినిమాలో నటిస్తున్నాడు. కాజల్ ఈ మూవీ లో హీరోయిన్. లక్ష్మి కళ్యాణం సినిమా తరువాత మళ్ళి వీరిద్దరూ కలిసి పని చేస్తున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు. ఈ ప్రాజెక్ట్ తో పాటు కళ్యాణ్ రామ్ మరో సినిమా చెయ్యబోతున్నాడు. త్వరలో ఈ సినిమా వివరాలు తెలుస్తాయి.